టాలీవుడ్ లో మా ఎన్నికల వ్యవహారం యు టర్న్ తీసుకుంటుంది. మా ఎలక్షన్స్ అన్నాక అసలు మెగాస్టార్ పెదవి విప్పలేదు. కానీ బాలయ్య మా భవనం, గతంలో ఫండ్స్ సేకరణ వంటి విషయాలను కెలికేసారు. మంచు విష్ణు లేఖలు, వీడియోస్, ఛానల్స్ కి లైవ్ ఇంటర్వూస్ అంటూ కాకపుట్టిస్తున్నాడు. మరోపక్క ప్రకాష్ రాజ్ కామ్ గా వేడుక చూస్తున్నారు. తాజాగా మంచు విష్ణు మా ఎన్నికల విషయంలో చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అది ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి లాంటి పెద్దల తర్వాత ఇండస్ట్రీని నడిపించడానికి సరైన వ్యక్తి ఎవరూ లేరు అంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అంటే ఇండస్ట్రీలో ఇప్పడు మెగాస్టార్ చిరునే పెద్దగా వ్యవహరిస్తున్నారు. కరోనా క్రైసిస్ టైం లో సినిమా కార్మికులకు నిత్యావసరాలు అందించడం, అలాగే సీసీసీ ద్వారా ఫండ్స్ పోగు చేసి సినీ కార్మికుల్ని ఆదుకోవడం, ఇంకా సినిమా పరిశ్రమ సమస్యల కోసం రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లని కలవడం, అలాగే చిన్న హీరోలకు మెగాస్టార్ దేవుడిగా కనిపించడం. ఏ సమస్య అయినా మెగాస్టార్ దగ్గర పరిష్కారం చేసుకునేలా చాలామంది ఆయన్ని సంప్రదించడం వంటివి చేస్తున్నారు. అంటే దాసరి తర్వాత చిరునే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు తప్ప ఆయనెప్పుడూ నేను పెద్దని అని ప్రకటించుకోలేదు.
కానీ ఇప్పుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు చూస్తే చిరుని ఇండైరెక్ట్ గా అనేసాడనే అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీలో పెద్ద అంటూ ఎవరు లేరు.. అందరూ సమానమే అంటూ బాలయ్య పలుకులనే మంచు విష్ణు పలికాడంటున్నారు కొందరు. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇస్తుంది అనే ఊహలోనే మంచు విష్ణు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని, మా ఎన్నికల విషయాన్ని మంచి రసవత్తరంగా మంచు విష్ణు మార్చడం గ్యారెంటీ అంటున్నారు కొందరు. మరి ఫైనల్ గా ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో చూడాలి.