రాజమౌళి తెరకెక్కించిన కళాఖండాలు గురించి ఎంత మట్లాడుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. రాజమౌళి చెక్కిన చిత్రాలు ఒకదానితో ఒకటి సరిపోల్చలేనివి. ప్రభాస్ తో బాహుబలి లాంటి భారీ బడ్జెట్ తో ప్రపంచాన్నే ఛుట్టేసిన రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలతో భారీ గా ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని బాహుబలితో పోలుస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ని 450 కోట్లతో నిర్మిస్తున్నారు. బాహుబలితో ఆర్.ఆర్.ఆర్ ని పోల్చడంపై ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు.
అంటే రాజమౌళి చేసే ఏ రెండు సినిమాలను పోల్చలేమని, అలాగే బాహుబలితో ఆర్.ఆర్.ఆర్ ని పోల్చలేమని, అయితే.. బడ్జెట్ విషయంలో బాహుబలి లెక్క వేరు.. ఆర్.ఆర్.ఆర్ లెక్క వేరు అంటూ బడ్జెట్ సీక్రెట్ రివీల్ చేసేసారు ఆయన. బాహుబలి కంటే ఆర్.ఆర్.ఆర్ చాలా పెద్దదని అన్నారు. అసలు బాహుబలి విజువల్ వండర్ అయితే, ఆర్. ఆర్. ఆర్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ రెండు సినిమాల మధ్యన ఉన్న సారూప్యతను ఎంతో అందంగా వివరించారు.