Advertisement
Google Ads BL

మంచు విష్ణు సన్సేషనల్ కామెంట్స్


టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎటునుండి ఎటు వెళ్తాయో కానీ.. ప్రస్తుతం మా ఎలక్షన్స్ వేడి టాలీవుడ్ ని కాకపుట్టిస్తుంది. ప్రకాష్ రాజ్ చేసిన హడావుడితో రంగంలోకి దిగినమంచు విష్ణు పర్ఫెక్ట్ గా పావులు కదుపుతూ.. వీడియోస్, లెటర్స్ అంటూ అగ్గి రాజేస్తున్నాడు. టాలీవుడ్ పెద్దలంతా కూర్చుని రాజి చేసి ఏకగ్రీవం చేస్తే నేను ఎన్నికల నుండి తప్పుకుంటాను.. మా భవనం మా ఫ్యామిలీ కడుతుంది అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చిన మంచు విష్ణు తాజాగా మరోసారి మా ఎన్నికల విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 

Advertisement
CJ Advs

మా ఎన్నికల్లో పోటీ చెయ్యమని తనని ఇండస్ట్రీ పెద్దలే కోరారు అని, తాను ఎన్నికల్లో నిలబడతాను అని అన్నప్పుడు పోటీగా ఎవరూ నిలబడలేదని, ఇప్పుడు మాత్రం పోటీ అంటూ వచ్చారని, మా కు శాశ్వత భవనం అజెండాతోనే మా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని, అదొక్కటే మా కి సమస్య కాదని, ఇంకా చాలా సమస్యలు మా లో ఉన్నాయని, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి నారాయణరావు వంటి పెద్దలు బ్రతికున్నపుడు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి నిలబడేవారని, ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరూ లేరంటూ మంచు విష్ణు సంచలనంగా మాట్లాడారు. 

అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి తాను, తన కుటుంబం సాయం చేశానని, నా నుండి సాయం పొందిన వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పనని.. అయితే ఇప్పుడు కొంతమంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని.. వాళ్లు కనుక శ్రుతి మించి ఎక్కువ మాట్లాడితే తప్పకుండా వాళ్ల పేర్లు బయటపెడతానంటూ మంచి విష్ణు హెచ్చరించారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

Manchu Vishnu Sensational comments on MAA Elections:

Manchu Vishnu Sensational Comments About Maa Elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs