Advertisement
Google Ads BL

పిక్ టాక్: పెట్ ఆరా తో రష్మిక


టాలీవుడ్ లో దూసుకుపోతూ.. బాలీవుడ్ ఆఫర్స్ పట్టేసిన రష్మిక మందన్న.. హైదరాబాద్ లో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో పుష్ప షూటింగ్ తో పాటుగా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షూట్స్ లో బిజీ అయ్యింది. ఉదయం ఓ షూట్, ఈవెనింగ్ ఓ షూట్ అబ్బో అమ్మడు బిజీ మాములుగా లేదు. ఇక బాలీవుడ్ లో ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా.. మరో ప్రాజెక్ట్ కూడా ఓకె చేయబోతుంది రష్మిక అనే న్యూస్ ఉంది. 

Advertisement
CJ Advs

ఇక తనెంత బిజీగా ఉన్నా తన దగ్గరకి ఈమధ్యనే వచ్చిన తన పెట్ ఆరా తో సమయాన్ని గడుపుతుంది. ఈమధ్యనే ముంబై లో ఛార్మి ని కలిసిన రష్మిక ఓ పెట్ ని పెంచుకుంటుంది. ఆ పెట్ తో రష్మిక గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా రష్మిక తానూ హాజరవ్వబోతున్న సినిమా షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటూ.. తన చేతిలో తన పెట్ ఆరా ని పెట్టుకుని దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ తో పాటుగా తన పెట్ ఆరా తనదగ్గరికి వచ్చేవారిని ఎంతగా అస్సహించుకుంటుందో..  This is how much Aura hates anyone coming near me.. 🤣 Sorry Vaishnavi 💕అంటూ తన మెకెప్ అసిస్టెంట్ వైష్ణవికి సారి చెప్పింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Pic Talk: Rashmi with Pet Aura:

Rashmika Mandanna latest pic viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs