తమిళ అసురన్ కి రీమేక్ గా తెరకెక్కిన నారప్ప నిన్న అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ అయ్యింది. నారప్ప లో వెంకటేష్ పెరఫార్మెన్సు కి అందరూ ఫిదా అవుతున్నారు. కాకపోతే అసురన్ చూసిన కళ్ళతో నారప్ప ఆనడం లేదు. ధనుష్ అసురన్ ముందు వెంకీ నారప్ప ఏమంత గొప్పగా లేదంటూ ఆరవ తంబీలు నానా యాగీ చేస్తున్నారు. నారప్ప సినిమాలో వెంకటేష్ పెరఫార్మెన్సు ఒక్కటే కొత్తగా ఉంది.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్పా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. నిన్న ఉదయం నుండి నారప్ప vs అసురన్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఇక నారప్ప సినిమాని థియేటర్స్ కోసం ఉంచకుండా ఇలా ఓటిటి లో రిలీజ్ చేసి సురేష్ బాబు మంచి పని చేసారు. ఈ సినిమా చూస్తుంన్నంత సేపు థియేటర్స్ లో చూస్తే బావుంటుంది అన్న ఫీలింగ్ కలగలేదంటున్నారు. మణిశర్మ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉన్నాయని అంటున్నారు. ఇక నారప్ప ని వీక్షించిన క్రిటిక్స్ కూడా నారప్పకి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. నారప్ప వెంకీ కెరీర్ లోనే మైలు రాయి అంటూ కొంతమంది కితాబునిచ్చేస్తున్నారు.
అసురన్ చూడని వారికీ నారప్ప బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. అసురన్ చూస్తే నారప్ప కాపి పేస్ట్ లా తప్ప ఇంకేం కొత్తదనం ఉండదు అని అంటున్నారు. అసురన్ ముందు నారప్ప తేలిపోయింది అని అంటున్నారు. మరి అమెజాన్ కోట్లు పోసి కొన్న నారప్ప వలన అమెజాన్ ప్రైమ్ కి లాభాలొచ్చాయో లేదో.. అనేది పక్కాగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్ ప్రస్తావన తేవడానికి అవకాశమే లేదు కాబట్టి. మరి దీన్ని బట్టి నారప్ప హిట్టో- ఫట్టో తెలిసేదెలా అంటున్నారు వెంకీ ఫాన్స్.