Advertisement
Google Ads BL

టాలీవుడ్ షూటింగ్స్ తో బిజీ బిజీగా రష్మిక


కన్నడ బ్యూటీ రష్మిక మందన్న లైఫ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. తెలుగు, బాలీవుడ్ మూవీస్ తో రాకెట్ లా దూసుకుపోతున్న రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక తాజాగా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు షూట్ లో జాయిన్ అయ్యింది. 

Advertisement
CJ Advs

హీరో శర్వానంద్ ప్ర‌స్తుతం మూడు సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్నారు. శర్వానంద్‌ నటించిన ఒకే ఒక జీవితం విడుదలకు సిద్ధమ‌వుతుండగా, మహాసముద్రం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో తన పూర్తి ఫోకస్‌ను తన లేటెస్ట్‌ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాపై పెట్టారు శర్వానంద్‌. ఈ మూడు వేటికవే డిఫరెంట్ మూవీస్ కావడం విశేషం.

టాలీవుడ్‌లో అగ్ర కథానాయకల్లో ఒకరిగా ఉన్న రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై కథల పట్ల మంచి అభిరుచి, ఎంపికలో మంచి నేర్పు ఉన్న ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న‌ఈ సినిమా చిత్రీకరణ ఈ రోజు నుండి మొదలైంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న స‌హా సినిమాటోగ్రాఫ‌ర్ సుజిత్ సారంగ్‌ను మ‌నం చూడొచ్చు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌ల‌పై కొన్ని కీల‌క‌స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌.

ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయి. కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తూన్నారు.

Sharwanand - Rashmika Aadavaallu Meeku Joharlu Shooting Begins:

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC Aadavaallu Meeku Joharlu Shooting Begins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs