Advertisement
Google Ads BL

నారప్ప పై రకరకాల కామెంట్స్


వెంకటేష్ - ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాలా తెరకెక్కించిన నారప్ప సినిమా తమిళంలో ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ కి రీమేక్ అని అందరికి తెలిసిందే. నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ధనుష్ ని కాకుండా వెంకీ ని చూసేలా చేసారు. వెంకీ నారప్ప గెటప్, ఆయన లుక్ ఆయన ఏజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నారప్ప టీజర్ అండ్ ట్రైలర్ అసురన్ కి కాపీ పేస్ట్ అంటూ కామెంట్స్ పడినా.. తాజాగా ఓటిటిలో విడుదలైన నారప్ప సినిమాలో వెంకీ పెరఫార్మెన్సు కి ఫుల్ మార్కులు పడిపోవడమే కాదు.. తమిళంలో ధనుష్ అసురన్ కన్నా వెంకీ నారప్ప గా అదిరిపోయాడు అని అంటున్నారు. మరి ధనుష్ ఫాన్స్ ఎందుకు ఊరుకుంటారు మా ధనుష్ అసురన్ ముందు వెంకీ నారప్ప ఎందుకు పనికి రాదంటున్నారు. అసురన్ బ్యాగ్ రౌండ్ స్కోర్ దగ్గర నుండి ధనుష్ యాక్టింగ్ వరకు సూపర్ అంటూ అరవ తంబీలు సోషల్ మీడియాలో అసురన్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ప్రియమణి లుక్స్ వైజ్ గా ఓకె.. కానీ డైలాగ్ డెలివరీ లో సహజత్వం లేదు అంటున్నారు. అలాగే నారప్ప పెద్ద కొడుకుగా చేసిన కార్తిక్ రత్నం పాత్ర ఎక్కువగా హైలెట్ అవుతోంది. సినిమాలో హైలెట్ క్యేరెక్టర్ ఇదేనని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అసురన్ చూడనివారికి నారప్ప ఓ అద్భుతం అంటుంటే... మరీ అసురన్ ని యాజిటీజ్ గా దించేశారు భయ్యా.. కాస్త మారిచాల్సింది అంటున్నారు కొందరు. తమిళ్ లో ఓ వర్గం ప్రేక్షకులు వెంకటేష్ నారప్ప ను ట్రోల్ చేస్తుండగా.. తెలుగోళ్లు వెంకీ ముందు ధనుష్ ఎంతా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా నారప్ప వెంకీ కెరీర్ లోనే ఓ స్పెషల్ ఫిలిం గా మిగిలిపోతుంది అని, నారప్ప లో వెంకీ లుక్స్ కానీ, ఆయన పెరఫార్మెన్స్ కానీ అభిమానులకి ఎప్పటికి ఓ ట్రీట్ అని,  ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నారప్ప ని ఫ్రెష్ గా వీక్షించండి అంటున్నారు మరికొందరు నెటిజెన్స్ . 

Various comments on Narappa:

Netizens review on Narappa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs