Advertisement
Google Ads BL

మహేష్ బాబుకి రాత్రి కష్టాలు


మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో జనవరిలో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగానే సాగిపోయింది. కానీ సెకండ్ వేవ్ తో సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేకులు వెయ్యాల్సి వచ్చింది. తాజాగా పోస్ట్ కరోనా షూట్ మొదలు పెట్టిన సర్కారు వారు పాట టీం మొత్తంకరోనా వ్యాక్సిన్ వేయించుకుని తగిన జాగ్రత్తలతో స్పాట్ లోకి అడుగుపెట్టింది. మహేష్ అండ్ పరశురామ్ లు ఓ యజ్ఞంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మహేష్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట నైట్ షూట్ లో పాల్గొంటున్నాడు. మహేష్ కీలక నటుల మీద ఈ నైట్ షూట్ చిత్రీకరణ జరుగుతుంది అని తెలుస్తుంది. కీర్తి సురేష్ కూడా ఈ సినిమా షూటింగ్ కి హాజరవుతుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో విలన్ గా తమిళ టాలెంటెడ్ నటుడు సముద్రఖని నటిస్తున్నట్లుగా టాక్. యూనిట్ నుండి ఈ విషయంపై అధికారిక ప్రకటనారావాల్సి ఉంది. మహేష్ ఈ చిత్రం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమా సినిమా సెట్స్ మీదకి వెళ్లిపోవాలి. ఆ తర్వాత మహేష్ రాజమౌళి మూవీ చెయ్యాల్సి ఉంది. 

Sarkaru Vaari Paata shooting night scenes:

<span>Mahesh is busy with night shoots</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs