కోలీవుడ్ స్టార్ విజయ్ - హీరో కార్తీ లకు మధ్యన మంచి స్నేహం ఉంది. తరుచు కలవకపోయినా.. వారి మధ్యన స్నేహం మాత్రం అప్పుడప్పుడు హైలెట్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా విజయ్ అండ్ కార్తీ మధ్యలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే కార్తీ నటిస్తున్న సర్దార్ మూవీ షూటింగ్ అలాగే విజయ్ రీసెంట్ మూవీ బీస్ట్ మూవీ షూటింగ్స్ చెన్నై లోని ఓ స్టూడియోలో జరుగుతున్నాయి. పోస్ట్ కరోనా షూట్స్ ని ఒకే స్టూడియో లో ఈ హీరోలిద్దరూ మొదలు పెట్టారట. అయితే అదే స్టూడియోలో షూటింగ్ చేసుకుంటున్న విజయ్ ని కలుద్దామని.. కార్తీ బీస్ట్ సెట్స్ కి వెళ్ళాడట. కానీ విజయ్ కార్తీని గుర్తుపట్టనేలేదట. మరి కార్తీ తన కొత్త సినిమా గెటప్ లో ఉంటె ఎలా గుర్తు పడతారు. పట్టారు కదా.
అంటే కార్తీని గుర్తుపట్టనంత లుక్ ఏమిటంటే.. కార్తీ సర్దార్ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఒక రోల్ లో కార్తీ నెరిసిన గెడ్డం, పెరిగిన జుట్టుతో ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడు. అదే లుక్ తో కార్తీ విజయ్ ని కలవడానికి వెళ్లి ఆ సెట్ లో ఓ 15 నిమిషాల పాటు తిరిగినా అక్కడ విజయ్ కానీ, ఇతరులెవరూ కానీ కార్తీ ని గుర్తుపట్టలేదట. విజయ్ కార్తీని అస్సలు గుర్తుపట్టలేదట. తర్వాత కార్తీ మాట్లాడుతుంటే ఎప్పటికో కానీ విజయ్ కార్తీని గుర్తుపట్టగా ముసిముసిగా నవ్వుకున్నారట. తర్వాత తమ సినిమా ముచ్చట్లను ఓ అరగంటసేపు మాట్లాడుకుని హ్యాపీగా అయ్యారట ఈ హీరోలిద్దరూ.