నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా మారిన అను ఇమ్మాన్యువల్.. ఆ తర్వాత చాలా త్వరగా స్టార్ హీరో అవకాశాలు పట్టేసింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ మెగా హీరోల ఛాన్సెస్ లతో అను ఇమ్మాన్యువల్ కెరీర్ అదిరిపోతోంది అనే అనుకున్నారు. కానీ అను ఇమ్మాన్యువల్ కి అల్లు అర్జున్ నా పేరు సూర్య, పవన్ అజ్ఞాతవాసి రెండు సినిమాల డిజాస్టర్స్ దెబ్బకి అవకాశం అన్నదే లేకుండా పోయింది. తర్వాత సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చేసి.. సన్నగా నాజూగ్గా మారిపోయింది.
సన్నగా గ్లామర్ గా తయారైన అను ఇమ్మన్యువల్ కి శర్వానంద్ మహాసముద్రం అవకాశం రావడమే కాదు.. మరో మెగా హీరో ప్రేమంటే ఇదే సినిమాలో నటిస్తుంది. అల్లు శిరీష్ హీరోగా వస్తున్న ఆ సినిమాలో అను ఇమ్మాన్యువల్ మరింత గ్లామర్ గా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో అను ఇమ్మాన్యూవేల్ కొత్త ఫోటో షూట్ వైరల్ అయ్యింది. క్లివేజ్ షో తో, అను ఇమ్మాన్యువల్ చాలా అంటే చాలా గ్లామర్ గానే కనిపిస్తుంది కానీ.. మరీ సన్నగా అనిపిస్తుంది. మరి ఇంత గ్లామర్ చూపిస్తున్న అను కి ఈ గ్లామర్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చూడాలి.