Advertisement
Google Ads BL

కమల్ తో బ్రేకప్: సినిమా ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి


కమల్ హాసన్ తన మొదటి భార్య తో విడిపోయి నటి గౌతమితో లివింగ్ రిలేషన్ లో చాలా ఏళ్లపాటు ఉన్నారు. కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న గౌతమి - కమల్ హాసన్ లు మొన్నీమధ్యనే.. విడిపోయారు. ఇద్దరి మధ్యన పొంతన కరువై బ్రేకప్ చేసుకున్నారు. అప్పటినుండి కమల్ హాసన్ రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో బిజీగా మారిపోయారు. కమల్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు గౌతమి కూడా అడపా దడపా సినిమాలు చేస్తుండేవారు. 

Advertisement
CJ Advs

కమల్ హాసన్ - గౌతమిలు కలిసి దృశ్యం రీమేక్ లో నటించారు. ఇప్పుడు దృశ్యం 2 లో కమల్ గౌతమి ప్లేస్ లోకి నదియాని తీసుకోబోతున్నారనే టాక్ ఉంది. అయితే గౌతమి కమల్ నుండి దూరంగా వెళ్ళిపోయాక ఖాళీగా కూర్చోకుండా తనకొస్తున్న సినిమా ఆఫర్స్ తో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం గౌతమి తెలుగు ప్రాజెక్ట్స్ తో బిజీ అవడమే కాదు.. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా ఫిలిం లోను ఓ కీలక పాత్ర పోషిస్తుంది. 

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో గౌతమి ఓ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లోను గౌతమి నటిస్తున్నారు. అలాగే స్వప్న సినిమాస్ బ్యానర్ లోను గౌతమి ఓ సినిమా చేస్తున్నారు. నటిగా గౌతమి ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్స్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు.  

Break up with Kamal: Choked with movie offers:

Gautami is busy with Telugu cinema offers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs