జబర్దస్త్ యాంకర్ అనసూయ వెండితెర మీద కూడా దున్నేస్తుంది. అనసూయ జబర్దస్త్ అందాలు బుల్లితెర మీదకే కాదు.. వెండితెర మీద కూడా విరివిగా కనిపిస్తూనే ఉన్నాయి. గ్లామర్ రోల్స్ రాకపోయినా.. నలుగురికి గుర్తుండిపోయే రోల్స్ తో అనసూయ అదరగొట్టేస్తుంది. తాజాగా రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ రవితేజ తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటిస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.
రీసెంట్ గా పుష్ప షూటింగ్ లో జాయిన్ అయ్యింది అనసూయ. పుష్ప సినిమాలో తన పాత్ర పై అనసూయ ఎగ్జైట్ అవడమే కాదు.. సుకుమార్ తనకి ఛాన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయమే. అదే గొప్ప విషయం అంటుంది అనసూయ. సుకుమార్ ఎవరికీ తన సినిమాల్లో రెండో ఛాన్స్ ఇవ్వరు. కానీ సుకుమార్ తనకి మరో ఛాన్స్ ఇచ్చారని, రంగస్థలంలో రంగమ్మత్తలాంటి గొప్ప పాత్ర ఇచ్చారని, మళ్ళీ ఇప్పుడు పుష్ప సినిమాలో మరో పాత్ర రావడం అదృష్టమని చెబుతుంది అనసూయ. పుష్ప సినిమాలో తన రోల్ ప్రత్యేకంగా ఉండబోతుంది అంటూ చెప్పి పుష్ప పై మరిన్ని అంచనాలు పెంచేసింది అనసూయ.