సురేష్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న నారప్ప సినిమా రేపు మంగళవారం ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది. ఓటిటి రిలీజ్ లపై నిర్మాత సురేష్ బాబు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ అవడమే బెటర్ అని అంటున్నారు సురేష్ బాబు. నారప్ప షూటింగ్ మొదలైనప్పుడు రెండు కోవిడ్ కేసులు బయటపడడంతో.... తమిళనాడు దగ్గరలో చేస్తున్న షూటింగ్ నుండి భయపడి, పారిపోయి వచ్చేశామని, కానీ లక్షల్లో కేసులు నమోదు అయినప్పుడు భయపడకుండా షూటింగ్ చేశామని, అన్ని జాగ్రత్తలతో షూటింగ్ చేశామని చెబుతున్నారు.
ఇక నారప్ప షూటింగ్ మొత్తంలో కోవిడ్ కారణంగా నాలుగురు చనిపోయాయారని ఆయన చెప్పారు. అయితే ఈమధ్యన రానా - సాయి పల్లవి విరాట పర్వం మూవీ కూడా ఓటిటి రిలీజ్ అంటూ వార్తలొస్తున్నాయని ఆయన్ని అడగగా.. బెటర్ డీల్ వస్తే విరాట పర్వం కూడా ఓటిటి రిలీజ్ చేస్తామేమో అని చెప్పారు ఆయన. బెటర్ బిజినెస్ జరిగితే విరాట పర్వం కూడా ఓటిటి లోనే రిలీజ్ చెయ్యొచ్చని క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు.