Advertisement
Google Ads BL

అఖిల్ ఏజెంట్ షూటింగ్ క్యాన్సిల్


అఖిల్ మూడు సినిమాలు లో ఒక్కటి కూడా హిట్ అవ్వకపోయేసరికి మోస్ట్ బ్యాచిలర్ పై ఆశలు పెట్టుకున్నాడు. అదేమో కరోనా కారణంగా రిలీజ్ వాయిదాలు పడుతుంది. ఇక తాజాగా సురేందర్ నరెడ్డి దర్శకత్వంలో అఖిల్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోయాడు లాక్ డౌన్ లో సూపర్ మేకోవర్ అయిన అఖిల్ ఏజెంట్ లుక్ కి అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. అందరూ షాకయ్యారు. అఖిల్ ఏజెంట్ కోసం ఎంత కసిగా ఉన్నడో ఆ లుక్ చూస్తేనే అర్ధమైపోతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా సెట్స్ మీద కెళ్లిన ఏజెంట్ కి అకాల వర్షాలు అడ్డంకిగా మారాయి. నెల్లూరు కృష్ణపట్నం రేవులో అఖిల్ ఏజెంట్ షూటింగ్ మొదలు పెట్టిన రెండు రెండు రోజులకే భారీ వర్షాలు పడుతుండడంతో.. షూటింగ్ కి అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అక్కడ అంత జోరు వానలో షూటింగ్ చెయ్యడం ఇబ్బందిగా మారడంతో అఖిల్ ఏజెంట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి యూనిట్ హైదరాబాద్ కి పయనమైనట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడ షూటింగ్ క్యాన్సిల్ కావడం వలన మేకర్స్ కి కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. 

Akhil Agent Shooting cancelled :

Akhil Agent Shooting cancelled due to Heavy rains 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs