బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఇంకా కెరీర్ లో బిజీ కాలేదు అనే ఫీలింగ్ అభిజిత్ ఫాన్స్ లో ఉంది. కానీ అభిజిత్ తనకు గతంలో వచ్చిన భుజం నొప్పి వలన ఈమధ్యన మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ విషయాన్నీ ఫాన్స్ తో పంచుకున్నాడు కూడా. అప్పుడు ఆభిజీత్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫాన్స్ పూజలు చెయ్యడమే కాదు సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు. బిగ్ బాస్ కన్నా ముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పెళ్లి గోల వెబ్ సీరీస్ తో ఆకట్టుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో అభిమానులకి, ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు.
అయితే తాజాగా ఉన్నట్టుండి.. అభిజిత్ ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. ఆయన ఫాన్స్ అభిజిత్ కొత్త సినిమాల అప్ డేట్స్ గురించి, అలాగే ఆయన హెల్త్ విషయంలో ట్వీట్స్ చేస్తూ ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. #Abijeet తో ట్వీట్స్, లైక్స్ తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. ఆయన బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చిన వీడియోస్, అభిజిత్ లాంగ్ డ్రైవ్ చేసే వీడియోస్, ఆయన ఫొటో షూట్స్ అన్ని షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.