Advertisement
Google Ads BL

రేపటి నుండి తెలంగాణలో థియేటర్స్ ఓపెన్


కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి సినిమా ఎగ్జిబిటర్స్ వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్ ను రద్దు చేయాలని, GO 75 ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు.

Advertisement
CJ Advs

అయితే తలసాని సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 

ఇక తాజాగా తెలంగాణాలో థియేటర్స్ తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో రేపట్నుంచి సినిమా థియేటర్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హామీతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త చిత్రాలను ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. థియేటర్లలో వంద శాతం సీటింగ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Theatres to open in Telangana:

Theaters set to open in Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs