తెలుగులో సినిమాలు చెయ్యలేకపోవడానికి కారణం కేవలం బాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉండడమే అని చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ మూవీస్ కోసం జిమ్ వర్కౌట్స్ మాత్రం ఓవర్ గా చేస్తుంది. మామూలుగానే ఫిట్ నెస్ అంటే ఇంట్రెస్ట్ చూపించే రకుల్.. బాలీవూడ్ లో సైజు జీరో కోసం ఫుల్ గా డైటింగ్స్, వర్కౌట్స్ చేస్తుంది. ఎప్పటినుండో సన్నగా నాజుగ్గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడం కోసం వెయిట్ లాస్ అయిన రకుల్ లుక్స్ పై ఇప్పుడు ట్రోలింగ్ మొదలయ్యింది.
చక్కటి శరీరాకృతితో అందంగా చూడముచ్చటగా ఉండే రకుల్ కి ఏమైంది. బాలీవుడ్ మోజులో పడి ఇలా చిక్కిపోయింది అంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ పై మెరిసింది. ఆ మ్యాగజైన్ కవర్ పేజీ పై రకుల్ ని చూసిన వారు మరీ పుల్లలా తయారయ్యింది.. ఏంటి రకుల్ ఈ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మల్లెతీగ లాంటి ఫిజిక్ తో కవర్ పేజ్ కే అందం తెచ్చిన రకుల్ అని కొందరు అంటుంటే.. ఛ ఊరుకోండి.. ఇంత సన్నగా మొహం లో కళ లేకుండా రకుల్ ని చూడలేకపోతున్నామంటున్నారు కొందరు.
మరీ ఎండిపోయిన చేపలా ఉంది రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. GRAZIA INDIA మ్యాగజైన్ కోసం రకుల్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. రకుల్ లుక్, ఆమె ఫోటో షూట్ పై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.