Advertisement
Google Ads BL

టీడీపీకి హ్యాండ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే


ఎస్ కోట నియోజకవర్గం నుంచి గతంలో టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన హైమావతి.. తనకి టిడిపి పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న శోభా టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా శోభా తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖపట్నం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Advertisement
CJ Advs

పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆమె పార్టీని వీడారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు. మరోవైపు ఆమె వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే శోభా తన భవిష్యత్తు కార్యాచరనను ప్రకటిస్తామని ప్రకటించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక మరోపక్క తెలంగాణలో కూడా పార్టీకి ఇటీవలే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరారు.

EX TDP MLA Shobha Hymavathi Quits TDP:

Shock to tdp ex mla shobha hymavathi quits party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs