Advertisement

ఎన్టీఆర్ 30 కి మారిన హీరోయిన్


ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్, ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ తో బిజీగా ఉంటున్న తారక్.. తన తదుపరి మూవీ కొరటాలతో పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్నాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కొరటాలతో చెయ్యబోయే ఎన్టీఆర్ 30 కి హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫైనల్ అయ్యింది అని.. అటు కియారా అద్వానీ కూడా ఓ సౌత్ సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పేసరికి అందరూ ఎన్టీఆర్ 30 కె కియారా రాబోతుంది అనుకున్నారు. 

Advertisement

కానీ తాజాగా ఎన్టీఆర్ 30 హీరోయిన్ కియారా అద్వానీ కాదని.. ఆమె ప్లేస్ లోకి క్రేజీ భామ పూజ హేగ్డ్ వచ్చి చేరింది అని అంటున్నారు. ఎన్టీఆర్ 30 లో పూజ హెగ్డే దాదాపు ఫైనల్ అట. కొరటాలతో ఆచార్య మూవీ చేసిన పూజ హెగ్డే ఎన్టీఆర్ తో అరవింద సమెత మూవీ చేసింది. సో సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న పూజ హెగ్డే అటు నార్త్ మూవీస్ లోను నటిస్తుంది. కాబట్టి పాన్ ఇండియాకి పూజ హెగ్డే అయితే బావుంటుంది అని కొరటాల - ఎన్టీఆర్ భావిస్తున్నారట. 

NTR and Koratala lock this heroine?:

NTR30 Heroine Locked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement