అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ సికింద్రాబాద్ లో మొదలైంది. సెకండ్ వేవ్ వలన దాదాపుగా రెండు నెలల షూటింగ్ ఆగిపోవడంతో.. తాజాగా సుకుమార్ పుష్ప రెస్యూమ్ షూట్ ని స్టార్ట్ చేసారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప షూటింగ్ కోసం ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే సుకుమార్ - అల్లు అర్జున్ తో వర్క్ చెయ్యాలని కోరికతో ఆయన ఉన్నట్లుగా ఈ మధ్యనే చెప్పారు. అయితే తాజాగా షూటింగ్ మొదలు పెట్టిన పుష్ప యూనిట్ కి ఇప్పుడికో భారీ షాక్ తగిలింది.
అదేమిటంటే పుష్ప కోసం వేసిన సెట్స్ చాలా వరకు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల వలన దెబ్బతినడంతో.. దీని వల్ల షూటింగ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉండడమే కాదు.. సెట్‌లు దెబ్బతినడం వల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది. 45 రోజుల పాటు సుదీర్గంగా పుష్ప షూటింగ్ చెయ్యాలి అని రంగంలోకి దిగిన యూనిట్ కి సెట్స్ వలన ఇబ్బందులు తలెత్తడంతో షూటింగ్ కూడా ఆలస్యం అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పుష్ప సినిమాని డిసెంబర్ లో క్రిష్ట్మస్ కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది.