బిగ్ బాస్ మొదలయ్యాక ప్రతి సీజన్ లో ఓ సెలెబ్రిటీ జంట ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంది. కానీ సీజన్ 1 అండ్ 2 లకు ఏ సెలెబ్రిటీ జంట దొరకలేదు. కానీ సీజన్ 3 కి మాత్రం వరుణ్ సందేశ్ - వితిక జంట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బాగానే ఎంటర్టైన్ చేసారు. బిగ్ బాస్ లో వరుణ్ ఇంకా వితిక లు జంటగాను, వేర్వేరుగాను ఆడి ఆకట్టుకున్నారు. ఇక సీజన్ 4 లో జంటలెవరు లేకపోయినా.. అఖిల్ సార్ధక్ - మోనాల్ గజ్జర్ లు మాత్రం జంటగా ప్రోజెక్ట్ ఆయ్యారు,. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోతుంది అనే న్యూస్ ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి అడుగుపెట్టే వారు వీరే అంటూ రోజుకో సెలెబ్రిటీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక తాజాగా ఓ సీరియల్ ఆర్టిస్ట్ తనకు కాబోయే భర్త తో కలిసి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సిరి హన్మంత్ మరియు శ్రీహాన్ ల జంట ఈ బిగ్ బాస్ హౌస్ 5లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగానే సిరి పేరు ఈ మధ్యనే బయటకు వచ్చింది. సిరి హన్మంత్.. శ్రీహాన్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి గతంలో పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆ తర్వాత ఓ కార్యక్రమంలోనే వీళ్లకు ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. ఇక సిరి సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ తో పాటుగా, స్టార్ మా కామెడీ షోస్ లో హడావిడి చేస్తుంది. ఇప్పుడు సిరికి తనకి కాబోయే భర్తకి కలిసి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మరి పెళ్ళికాకముందు వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి రచ్చ చేసి స్టార్ మాకి టిఆర్పి పెంచుతారో చూడాలి.