Advertisement
Google Ads BL

చిన్నారి పెళ్లికూతురు బామ్మ ఇకలేరు


బాలీవుడ్ లో సూపర్ హిట్ సీరియల్ బాలిక వదు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా డబ్ అయ్యింది. ఆ సీరియల్ ద్వారానే అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సీరియల్ లో అవికా గోర్ చిన్నవయసులోనే పెళ్లి చేసుకుని చిన్నారి పెళ్లి కూతురుగా జమిందారీ ఇంట అడుగుపెడుతుంది. అక్కడ భర్త బామ్మ గారి చేతిలో అడుగడుగునా అవమానాలు, ఇబ్బందులు పడుతూ అవికా గోర్ ఆ ఇంట నిలబడుతుంది. అందులో బామ్మగా నటించిన సురేఖ‌ సిఖ్రి అందరి మదిలో విలన్ గా ముద్ర వేసుకుంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా సురేఖ‌ సిఖ్రి మృతి చెందడం బాలీవుడ్ లో విషాదాన్ని మిగిల్చింది. సురేఖ‌ సిఖ్రి కొన్నాళ్లుగా అనారోగ్య సమ‌స్య‌ల‌తో బాధపడుతున్నార‌ని.. నిన్న గుండెపోటు రావడంతో ఆవిడ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం షూటింగ్‌ సమయంలో బాత్రూంలో సురేఖ సిఖ్రి జారిప‌డడంతో ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చింది. ఆతర్వాత ఆవిడ కోలుకున్నప్ప‌టికీ రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తాజాగా హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె  మరణించినట్లుగా ఆమె మేనేజర్ తెలిపారు. సురేఖ‌ సిఖ్రి మృతి పట్ల సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

Chinnari Pellikuthuru actress Surekha Sikri died of cardiac arrest:

Balika Vadhu actress Surekha Sikri died of cardiac arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs