Advertisement
Google Ads BL

నారప్ప ఓన్లీ సోషల్ మీడియా


వెంకటేష్ నారప్ప జులై 20 న ఓటిటి నుండి అంటే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. థియేటర్స్ కాకుండా భారీ అంచనాలున్న నారప్ప ఓటిటి నుండి రిలీజ్ అవడంపై వెంకీ ఫాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. థియేటర్స్ ఓపెన్ చేసాక కూడా ఇలా ఓటిటి రిలీజ్ ఏమిటి అంటూ అటు థియేటర్స్ యాజమాన్యాలు, ఇటు వెంకటేష్ ఫాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో నిర్మాతలు ఎలా రిలీజ్ చేసుకుంటారో అది వాళ్ళిష్టం అంటూ సురేష్ బాబు నారప్ప రిలీజ్ పై క్లారిటి ఇచ్చేసారు. 

Advertisement
CJ Advs

అయితే మంగళవారం రిలీజ్ అవ్వబోతున్న నారప్ప ప్రమోషన్స్ అన్ని సోషల్ మీడియాలోనే జరుగుతూన్నాయి. 

అంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం కానీ, నారప్ప టీం మొత్తం మీడియా ముందుకు రావడం కానీ చెయ్యడం లేదు. పోనీ టాలీవుడ్ లో మీడియా మీట్స్, ప్రెస్ మీట్స్, ఓపెనింగ్స్ జరగడం లేదా అంటే.. అదేం లేదు.. కరోనా సెకండ్ వేవ్ తగ్గాక యధావిధిగా చాలా సినిమాల ప్రెస్ మీట్స్, ఓపెనింగ్స్ తో టాలీవుడ్ కళకళలాడుతుంది. కానీ నారప్ప టీం మాత్రం ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం లేదు. జస్ట్ సోషల్ మీడియా ప్రమోషన్స్ అంటూ రోజుకో సాంగ్, లేదా ట్రైలర్, లేదా పోస్టర్స్ అంటూ హడావిడి చేస్తుంది తప్ప.. మీడియా కి ముఖం చూపించడం లేదు. 

Narappa Promotion Only on Social Media:

Venkatesh Narappa to premiere July 20 on Amazon Prime
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs