Advertisement
Google Ads BL

అఖిల్ కోసం రంగంలోకి నాగ్


అక్కినేని నాగార్జున పెద్ద స్టార్ అయ్యుండి.. ఆయన చిన్న కొడుకు అఖిల్ ని ఇంకా హీరోగా నిలబెట్టలేకపోయారు. నాగార్జున కూడా అఖిల్ కెరీర్ కోసం మదన పడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని అల్లు అరవింద్ చేతిలో పెట్టిన నాగార్జున.. అఖిల్ ఏజెంట్ కోసం స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడట. అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి కాంబో లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఏజెంట్ మూవీ మొన్ననే అఫీషియల్ గా సెట్స్ మీదకెళ్లింది. ఈ సినిమాలో అఖిల్ కి గురువుగా మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడని, ఆయనకి ఏకంగా మూడు కోట్లు పారితోషకం ఇచ్చి మరీ తెచ్చారని న్యూస్ చక్కర్లు కొట్టింది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఏజెంట్ మూవీ నటుల ఫైనల్ లిస్ట్ లో మమ్ముట్టి పేరు లేదట. త్వరలోనే నటుల వివరాలు తెలియజేస్తామన్న టీం.. ఓ లిస్ట్ సిద్ధం చేసిందట. అందులో మమ్ముట్టి పేరు లేదట. అంటే మమ్ముట్టి కి ఇచ్చారన్న కేరెక్టర్ లో అక్కినేని నాగార్జున నటించబోతున్నారని టాక్ నడుస్తుంది.  నాగార్జున ఎలాగైనా కొడుకు అఖిల్ కి గట్టి హిట్ ఇవ్వాలని.. ఆ కీలక పాత్ర చెయ్యడానికి ఫిక్స్ అయినట్లుగా ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ అందరిని ఆకట్టుకుంది.. అఖిల్ కి జోడిగా ముంబై మోడల్ సాక్షి నటిస్తుంది. 

A surprising revelation about Agent:

Agent: Director against Nagarjuna entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs