Advertisement
Google Ads BL

ఐదుగురు అక్కాచెల్లెళ్లు: అందరూ కలెక్టర్లే


ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే ఆ వూరు ఊరంతా సంబరాలు జరుపుకుంటారు. తమ ఊరిలో ఓ కలెక్టర్ ఉన్నారంటూ గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. అదే ఒక ఊరి అటుంచి, ఒకే ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్‌ సహరన్‌ కుటుంబం.సహదేవ్‌ సహరన్‌ చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, అలాగే ఆయన అత్యంత ధన వంతుడా అనుకునేరూ.. కానే కాదు సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. 1) రోమా, 2) మంజు, 3) అన్షు, 4) రీతు, 5) సుమన్‌లు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్‌.

Advertisement
CJ Advs

అయితే తనకు చిన్నప్పటినుండి కలెక్టర్‌ కావాలన్న ఉన్న కోరికను తన కుమార్తెలకు చెప్పారట ఆయన. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టడంతో..తండ్రిని అర్థం చేసుకున్న కుమార్తెలువు ఐదుగురు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా.. కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి కోరికను, ఆయన ఆశయాన్ని నెరవేర్చి అందరికి ఆదర్శ ప్రాయంగా నిలిచారు.

ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్‌లోని హనుమాఘర్‌ లో నివసిస్తోంది. 2018 లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా... అన్షు, రీతు, సుమన్‌ లకు రాజస్తాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ (ఆర్‌ఎఎస్‌)కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. తమ వైపుకు అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. 

అప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా మారిపోయారు. మరి కన్నతండ్రి కోరిక నెరవేర్చడానికి ఏ ఒక్కరో పాటుపడితే అందులో గొప్పేముంటుంది.. ఒక రైతు కన్న కలను ఆయన ఐదురు కూతుర్లు నిజం చేసి ఆ తండ్రికి ఎప్పటికి మరిచిపోలేని గొప్ప బహుమతిని ఇచ్చారు ఆయన ఐదుగురు కూతుర్లు.  

Five sisters in one house: all collectors:

Five daughters of poor farmer became RAS officer in Rajasthan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs