ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం మా ఎన్నికలు. మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు అన్నట్టుగా ఉంది వ్యవహారం.. మిగతా పోటీదారులు డమ్మీలుగానే కనిపిస్తున్నారు తప్ప గట్టి పోటీ ఇచ్చేలా లేరు. మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కయ్యనికి కాలు దువ్వుతున్నారు. మంచు విష్ణు.. బాలకృష్ణ, చిరు, నాగ్ లాంటి వారు కూర్చుని మాట్లాడి ఏకగ్రీవం చేస్తే ఎన్నికల నుండి తప్పుకుంటాను, మా అధ్యక్ష భవనము నేను, నా ఫ్యామిలీ కడుతుంది అంటున్నారు. మధ్యలో చిరు, నాగ్, బాలయ్య లాంటి వాళ్ళు మాట్లాడడం లేదు.
తాజాగా బాలకృష్ణ మా ఎన్నికల విషయాన్నీ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడారు. మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే పదాన్ని పట్టించుకోను అని అంటున్నారు ఆయన. మరోసారి మా భవనానికి ఫండ్స్ సేకరించిన విషయాన్నీ కదిపారు. గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ.. ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని మరీ అమెరికాకి విమానాల్లో తిరిగారు. అలా సేకరించిన డబ్బులు ఏం చేశారు అంటూ బాలయ్య ప్రశ్నిస్తున్నారు. మా కి ఎప్పటి నుండో భవనం కడతామని అంటున్నారు.. ఇంతవరకు శాశ్వతంగా ఓ భవనము ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి మా కోసం ఓ ఎకరం భూమిని కూడా సంపాదించుకోలేకపోయారంటూ.. బాలయ్య సంచలనంగా మాట్లాడారు.
మా భవనం కట్టే విషయంలో మంచు విష్ణు చెప్పినట్లుగా చేస్తే.. అందులో నేను భాగస్వామినవుతానని అన్నారాయన. అదే అందరం కలిస్తే.. మా కోసం ఓ భవనం ఏమి ఖర్మ.. మయసభలాంటి ఇంద్ర భవనమే కట్టొచ్చు అంటూ చెప్పారు. అంతేకాదు.. సినిమా ప్రపంచమే గ్లామర్ ప్రపంచము. మన సమస్యలను ఇలా బహిరంగంగా రోడ్డున పడెయ్యొద్దు అంటూ సున్నితంగా హెచ్చరించారు బాలయ్య.