అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించినా పెద్దగా ఫేమ్ అయితే సంపాదించలేకపోయింది. హోమ్లీ గా, క్యూట్ గా ఉండే అనుపమ ఈ మద్యన గ్లామర్ షో చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ లోను నటిస్తుంది. ఈమధ్యనే తానొక వ్యక్తిని ప్రేమించి, బ్రేకప్ చేసుకున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు ఒకదానికి బానిసగా మారిపోయిందట
ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ దేనికి బానిస అయ్యింది అంటే.. ఓ ఆటకట. అదేం ఆటో.. ఎలా ఆడాలో కూడా చెబుతుంది అనుపమ. గిబ్బరిష్ అనే ఈ ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. ఇప్పుడు అదే ఆటలో అనుపమ ఈ ఆటలో మునిగి తేలడమే కాదండోయ్.. ఆ ఆటకు తాను ఎంతగా బానిస అయ్యిందో కూడా చెబుతుంది.