Advertisement
Google Ads BL

కత్తి మహేష్ మృతిపై విచారణ అప్ డేట్


సినీ క్రిటిక్ కత్తి మహేష్ చనిపోయి రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన మృతిపై రోజురోజుకూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్ మృతి పై ఆయన తండ్రి ఓబులేసు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కత్తి మహేష్‌ తండ్రి ఓబులేసు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే కత్తి మహేష్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లిన మంద కృష్ణ మాదిగ  కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు. మహేష్ భౌతిక కాయానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళులర్పించకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. దళితులంటే ఇంకా చులకన భావమే ఉందని, గౌరవం, గుర్తింపు ఇవ్వబోరని మరోసారి అర్థమైందని మందకృష్ణ అన్నారు.  

ఇప్పటికే కత్తి మహేష్ మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మహేష్ కారు డ్రైవర్ సురేష్‌ను నెల్లూరు జిల్లా పోలీసులు విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగినప్పుడు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే సురేష్‌కు ఎందుకు చిన్న గాయం కాలేదని అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సురేష్ ని నాలుగు గంటల పాటు పోలీస్ లు విచారించినట్లుగా తెలుస్తుంది. 

Inquiry update on Kathi Mahesh death:

Kathi Mahesh Death Suspicious, Says Father
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs