అక్టోబర్ 13 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు ముందు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టడానికి రాజమౌళి సిద్ధమైపోయారు. రెండు రోజుల నుండి RoarofRRR మేకింగ్ వదలబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చింది మొదలు ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ ఆర్.ఆర్.ఆర్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. జులై 15 న RoarOfRRR ని రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించినప్పటినుండి ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు, ఆత్రుత మరింతగా పెరిగిపోతున్నాయి.
ఇండియా వైడ్ మార్కెట్ లో ఆర్.ఆర్.ఆర్ పై ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో చూస్తున్నాం. రామ్ చరణ్ - ఎన్టీఆర్, అల్లూరి - కొమరం భీం పాత్రలతో మ్యాజిక్ చెయ్యబోతున్న ఆర్.ఆర్.ఆర్ పై రాజమౌళి క్షణక్షణానికి అంచనాలు పెంచేస్తున్నారు. రేపు ఉదయమే అంటే 11 గంటలకు RoarOfRRR ని విడుదల చెయ్యబోతున్నట్టుగా ఓ పోస్టర్ తో పాటుగా తాజాగా టీం అప్ డేట్ ఇచ్చింది. ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నీడలు కనిపిస్తూన్నాయి. మరి రేపు ఉదయం ఆర్.ఆర్.ఆర్ నుండి రాబోయే అదిరిపోయే RoarOfRRR కోసం ఇప్పటినుండే కాదు.. ఎప్పటినుండో ఫాన్స్ వెయిటింగ్.