Advertisement
Google Ads BL

గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు సునీత రచ్చ


అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ బ్యానర్ లో యంగ్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకుంటున్న బన్నీ వాస్ పై ఆర్టిస్ట్ సునీత బోయ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. మొన్నీమధ్యనే పుచ్చకాయలు అమ్ముకుంటూ టివి ఇంటర్వూస్ లో కనిపించిన సునీత బోయ మరోసారి గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు రచ్చ రచ్చ చేసింది. తనకి అవకాశాలు ఇప్పిస్తాను అని బన్నీ వాస్ మోసం చేశాడంటూ సునీత బోయ ఇప్పటికి పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

అయితే సునీత బోయ మానసిక పరిస్థితి బావుండలేని కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ ఆమె తల్లితండ్రులు ఓ లెటర్ ద్వారా ఇంతకుముందే తెలిపారు. ఆమె ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బన్నీ వాస్ విషయంలో ఆమె ఇప్పటికే రెండు సార్లు జైలుకు కూడా వెళ్ళింది. ఇప్పుడు తాజాగా మరోసారి సునీత గీతా ఆర్ట్స్ఆఫీస్ దగ్గర హల్ చల్ చేయడంతో గీత రత్స్ ఆఫీస్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆ తర్వాత సునీత బోయని న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక ఆస్పతికి తరలించాలనీ జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయమూర్తిని కోరారు. సునీత బోయ ఎప్పటికప్పుడు బన్నీ వాస్ ని నీడలావెంటాడుతూనే ఉంది. నిజంగానే ఆమెకి మానసిక పరిస్థితి బాలేదా? లేదంటే మరేదన్నా కథ ఉందా? అంటూ ఇప్పుడు నెటిజెన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Junior Artist Sunitha Boya suicide attempt at Geetha Arts Office:

Jubilee Hills Police Arrested junior artist Sunitha Boya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs