వెంకటేష్ - ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ అసురన్ రీమేక్ నారప్ప ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. థియేటర్స్ లో కాకుండా నారప్ప అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి జులై 20 రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. నారప్ప వెంకీ యంగ్ లుక్స్, అలాగే ఓల్డ్ లుక్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే పోస్టర్ అండ్ టీజర్ లో వెంకీ నారప్ప గెటప్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నారప్ప ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. నారప్ప ట్రైలర్ మొత్తం యాక్షన్ తోనే నిండిపోయింది.
నారప్ప భార్యగా ప్రియమణి లుక్స్, వెంకీ లుక్స్ ఆయన ఏజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇంకా ట్రైలర్ లో తన ఫ్యామిలీ కోసం ఎంత దూరమైన వెళ్లే ఓ రైతు కథ. బ్రతుకుపోరాటంలో ఎదురొచ్చిన వారిని అడ్డంగా నరుక్కుంటూ పోవడమే ఈ సినిమా కథాంశం. అలాగే తండ్రి కొడుకుల అనుబంధంగా ఈ సినిమా తెరకెక్కింది. మన దగ్గిర భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బుంటే లాగేసుకుంటారు కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గిర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు.. అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఫ్లాష్ బ్యాక్ లోను వెంకటేష్ మాస్ యాక్షన్ భీభత్సంగా ఉంది. వెంకీ ఫేస్ ఎక్సప్రెషన్స్ నారప్ప పాత్రకి హైలెట్ అనేలా ఉన్నాయి. ప్రియమణి నారప్ప భార్యగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. మంచి టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన నారప్ప అమెజాన్ ప్రైమ్ లో జులై 20 న అందుబాటులోకి రానుంది..