ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు రామ్ కి చాలా వరకు సో సో సినిమాలే ఉన్నాయి. ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమకోసమే లాంటి సినిమాల్తో సో సో గా ఉన్న రామ్ ఇస్మార్ట్ హిట్ తో ఒక్కరిగా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ తర్వాత రామ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రెడ్ మూవీ చేసాడు. ఆ సినిమా సో సో టాక్ తెచ్చుకుంది. తాజాగా రామ్ లింగుసామితో తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో RAPO19 లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మాస్ టైటిల్ గా ఉస్తాద్ పెట్టబోతున్నారనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి రామ్ అందుకోబోతున్న పారితోషకం హాట్ టాపిక్ గా మారింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింఫ్ తాజాగా మొదలైంది. అయితే ఈ సినిమాకి రామ్ ఏకంగా 13 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడట. ఇప్పటివరకు 10 కోట్లు పారితోషకంతో సరిపెట్టుకున్న రామ్.. RAPO19 కోసం ఏకంగా 13 కోట్లు పారితోషకం పెంచేసాడట. అంటే ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టే రామ్ ఈ రేంజ్ పారితోషకాన్ని పెంచినట్టుగా టాక్. రామ్ కి 13 కోట్లు ఇస్తుంటే.. దర్శకుడు లింగుస్వామికి 6 కోట్లు ముట్ట జెబుతున్నారట RAPO19 మేకర్స్.