జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా అందాలు వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. హీరోయిన్స్ అయినా కాస్త గ్యాప్ తీసుకుంటారేమో కానీ అనసూయ మాత్రం అస్సలు గ్యాప్ తీసుకోదు. కొత్త కొత్త ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని ఆక్యుపై చేస్తుంది. అంగాంగ ప్రదర్శనతో అదరగొట్టేసే అనసూయ భర్త భరద్వాజ్ తో ఎంజాయ్ చేసే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తన భర్త తో ఎంత ఆనందంగా ఉన్నానో అంటూ చెప్పకనే చెబుతుంది.
తాజాగా తమిళనాడులోని డెర్బీ గ్రీన్ లోని నేచురల్ అందాలను ఆస్వాదిస్తూ.. భర్త భరద్వాజ్ పక్కన సిగ్గుపడుతూ మైమరచిపోయి.. చిరునవ్వు చిందిస్తున్న అనసూయ.. తన భర్తతో ఉన్న మధుర క్షణాలను ఫోటో రూపంలో పంచుకోవడమే కాదు.. ఆ పిక్ తో పాటుగా FYI, I am wearing the smile you gave me..లవ్ యు భరద్వాజ్ అంటూ పోస్ట్ చేసింది. తన భర్త కౌగిలిలో ఎంత అందంగా ఉన్నానో అనేది అనసూయ ఈ పిక్ ద్వారా స్పష్టం చేసింది.