Advertisement
Google Ads BL

విజయ్ తో వర్క్: ఎగ్జైట్ అవుతున్న హీరోయిన్


టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు తమిళ్ జెండా పాతడానికి రెడీ అయ్యింది. తెలుగు స్టార్ హీరోలందరిని చకచకా చుట్టేసిన పూజ హెగ్డే అటు బాలీవుడ్ లోను బిజీగా ఉంటూనే ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ అంటూ భారీ బడ్జెట్ మూవీలో నటించేస్తుంది. అంతేకాదు పూజ హెగ్డే బీస్ట్ షూటింగ్ లో విజయ్ మంచి మనసు గురించి తెగ ఎగ్జైట్ అవుతుంది. విజయ్ తో బీస్ట్ షూటింగ్ లో పాల్గొంటున్న పూజ హెగ్డే విజయ్ బిహేవియర్ చూసి తెగ ఇదైపోతుంది. విజయ్ చాలా మంచోడు అంటూ కితాబునిచ్చేస్తుంది. 

Advertisement
CJ Advs

పూజా హెగ్డే కోసం విజయ్ తీసుకొన్న జాగ్రత్తలు, పూజ హెగ్డే చుట్టూ ఉండే ఆమె పర్సనల్ స్టాఫ్ మొత్తానికి నిర్మాతలు స్టార్ హోటల్‌లో వసతి కేటాయించిన విధానానికి ముచ్చటపడి పోతుంది. సెట్స్ లో విజయ్ ప్రవర్తన, ప్రతీ చిన్న యాక్టర్ గురించి తీసుకొనే శ్రద్దను చూసి పూజా హెగ్డే ఫ్లాట్ అయ్యిపోతుంది. స్టార్ హీరోలు సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. వారి కోసం సెట్ వాతావరణమే నిశ్శబ్దంగా మారిపోతున్న రోజుల్లో విజయ్ సెట్ లోకి అడుగుపెట్టగానే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది అని.. విజయ్ స్టార్ హీరోలందరిలో చాలా డిఫ్రెంట్ అంటుంది పూజ హెగ్డే. 

Pooja Hegde Flats To Thalapathy Vijay Attitude:

Pooja Hegde flats to Thalapathy Vijay attitude and behaviour in Beast sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs