Advertisement
Google Ads BL

రాక్షసుడు సీక్వెల్.. ఈసారి


తమిళ్ లో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన రచ్చసన్ మూవీ ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించారు. తెలుగులో మంచి హిట్ అయిన ఈ సినిమాని సత్యన్నారాయన కోనేరు నిర్మిచారు. అయితే ఇప్పుడు ఈ రాక్షసుడు సినిమాకి సీక్వెల్ రాబోతుంది. రమేష్ వర్మ దర్శకుడిగా కోనేరు సత్యన్నారాయణ నిర్మాతగా.. రాక్షసుడు 2 అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ నటించడం లేదు. 

Advertisement
CJ Advs

ఓ పెద్ద హీరో రాక్షసుడు సీక్వెల్ లో నటించబోతున్నాడని.. రాక్షసుడు మేకర్స్ అధికారిక ప్రకటనలో తెలియజేసారు. రాక్షసుడు గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అంటూ మేకర్స్ రాక్షసుడు సీక్వెల్ పై అనౌన్సమెంట్ ఇచ్చేసారు. టైటిల్‌ పోస్టర్‌ విషయానికి వస్తే.. ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన  వెనకాల ఓ చైన్‌కు ర‌క్తంతో త‌డిసిన ప‌దునైన‌ కత్తి వేలాడుతుండ‌డం మ‌నం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్లోని  అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతున్నాయి.

డిఫరెంట్‌ సెటప్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే రాక్షసుడు 2 చిత్రం రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజ ఖిలాడీ మూవీ ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ అవ్వగానే రమేష్ వర్మ రాక్షసుడు సీక్వెల్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.   

Rakshasudu 2 Announced:

<span>Ramesh Varma, Havish Production, Satyanarayana Koneru Rakshasudu 2 Announced</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs