Advertisement
Google Ads BL

బాలయ్య అఖండ అప్ డేట్ కూడా వచ్చేసింది


బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండ షూటింగ్ మరియు రిలీజ్ కూడా సెకండ్ వేవ్ ఉధృతి వలన పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. అఖండ ఫైనల్ షెడ్యూల్ ఉండగా.. సెకండ్ వేవ్ పెరిగిపోవడంతో షూటింగ్ ఆపేసారు. బాలకృష్ణ అఖండగా, అఘోరగా కనిపించనున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలున్నాయి. బాలయ్య పెరఫార్మెన్స్ , ఆయన అఖండ లుక్, బోయపాటి మేకింగ్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఓ 15 రోజుల షూట్ చేస్తే అఖండ షూటింగ్ ఫినిష్ అవుతుంది. గత వారమే బోయపాటి అఖండ ఫైనల్ షూట్ లొకేషన్స్ కోసం కడప, చిత్తూరు లోని చారిత్రాత్మక ప్లచెస్ చూస్తున్నామని త్వరలోనే షూట్ మొదలు పెడతామని చెప్పారు. 

Advertisement
CJ Advs

ఇక బోయపాటి చెప్పినట్టుగానే ఈ రోజే అఖండ రెస్యూమ్ షూట్ మొదలైనట్టుగా అప్ డేట్ ఇచ్చింది టీం. ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు పెట్టినట్లుగా అప్ డేట్ ఇచ్చిన టీం అఖండ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టుగా నందమూరి ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ROARING SOON IN CINEMAS! 🦁 అంటూ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్స్ గా ప్రగ్య జైస్వాల్, పూర్ణ నటిస్తుండగా.. విలన్ రోల్ లో హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. 

Balakrishna Akhanda Shoot Resumes :

Balakrishna - Boyapati Akhanda Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs