Advertisement
Google Ads BL

అఫీషియల్: నారప్ప ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్


కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో థియేటర్స్ మూతబడి.. సెకండ్ వేవ్ కంట్రోల్ కి రాగానే మళ్ళీ తెరుచుకున్నప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ  అంచనా వెయ్యలేని నిర్మాతలు ఓటిటి రిలీజ్ లకి మొగ్గు చూపుతున్నారు. అక్టోబర్ వరకు ఆగండి అప్పుడు థియేటర్స్ 100 పర్సెంట్ తో తెరుచుకోకపోతే.. మీరు ఓటిటి రిలీజ్ చేసుకోమని థియేటర్స్ యాజమాన్యాలు చెప్పినా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన తమ్ముడ వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2, ఆయన కొడుకు రానా నటించిన విరాట పర్వం సినిమాలనున ఓటిటికి విక్రయించేసారు. 

Advertisement
CJ Advs

ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు వెంకటేష్ థియేటర్స్ లోనే నారప్ప రిలీజ్ చేద్దామని మంతనాలు జరిపినా.. అది సెట్ అవ్వకపోయేసరికి నారప్ప ఓటిటి రిలీజ్ డేట్ ఇచ్చేసారు. నారప్ప అమెజాన్ ప్రైమ్ నుండి జులై 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ప్రకటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ధనుష్ అసురన్ రీమేక్ నారప్ప.. పై మంచి అంచనాలున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ  ప్రియమణి కాంబోలో తెరకెక్కిన నారప్ప జులై 20 న అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. 

Vnekatesh Narappa OTT release locked:

Vnekatesh Narappa will release directly on Amazan Prime From This July 20.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs