Advertisement
Google Ads BL

కల నెరవేరింది అంటున్న సోను సూద్


ఒకప్పుడు విలన్ పాత్రలతో అందరితో తిట్టించుకున్న సోను సూద్.. ఇప్పుడు రియల్ హీరోలా అందరి మనసులో చోటు సంపాదించాడు. ప్రత్యక్షంగా దేవుడిని చూడకపోయినా.. సోను సూద్ ఇప్పుడు నిజమైన దేవుడిలా కనిపిస్తున్నాడంటూ అందరూ ఆయన్ని పొగుడుతున్నారు. సోను సూద్ కి అందరు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్న సోను సూద్ ఇప్పుడు ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ మీద సందడి చేస్తున్నాడు. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద సోను సూద్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్స్, స్టైలిష్ హీరోస్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఇప్పుడు సోను సూద్ ఉండడం మరింత కిక్కిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే తన ఫొటోస్ ని కవర్ పేజీ మీద చూసుకున్న సోను సూద్.. గతంలో సినిమా అవకాశాల కోసం లూథియానా నుంచి డీలక్స్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కి.. ముంబై రైల్వే స్టేషన్‌లో దిగాను. అయితే లూథియానా రైల్వే స్టేషన్‌లో ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు ఇలా ఇరవై ఏళ్ల తరువాత నేను ఆ మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఉన్నాను.. దీనిని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏమిటంటే.. మన కలలు నెరవేర్చుకోవడానికి సమయం ఎంతైనా పట్టొచ్చు కానీ ఒకనాటికి నెరవేరుతుంది అని సోనూ సూద్ తన కల ఎలా నెరవేరిందో చెప్పుకొచ్చాడు. 

Sonu Sood dream come true:

Sonu Sood graces the cover page of Filmfare Magazine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs