Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ సూపర్ షాక్


సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ గత ఏడాది రాజకీయాల్లోకి రాబోయి ఆరోగ్యపరమైన కారణాలతో రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన రజినీకాంత్ అమెరికా ప్రయాణం తర్వాత నేడు అభిమానులను కలవడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజినీఅంత్ అభిమాన సంఘాలతో మీట్ అయ్యారు. 

Advertisement
CJ Advs

ఆ మీటింగ్ లో తాను రాజకీయాల్లోకి రావడం లేదని అభిమానులకి స్పష్టం చేసారు రజినీకాంత్. నార్మల్ హెల్త్ చెకప్ కోసమే తాను అమెరికా వెళ్ళాను అని, సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ సిట్యువేషన్ వలన కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను అని.. అందుకే ఈ రోజు నిర్వాహకులందరితో సమావేశమయ్యాను. నా అభిమానులందరికి నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. అసలు ఫ్యూచర్ లో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు. 

కానీ నేను రాజకీయాల్లోకి రావట్లేదు. ఆరోగ్యపరమైన కారణాల దృశ్య నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాను.. అంటూ ఆయన రాజకీయ అరంగేట్రం పై వస్తున్న వార్తలకు ఫుల్ క్లారిటీ తో ఫుల్ స్టాప్ పెట్టారు రజినీకాంత్. 

Superstar Rajinikanth Super shock :

Will Reconsider My Decision to Stay Away from Politics Latest Twist in Rajinikanth Tamil Nadu Potboiler
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs