అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రఫ్ గా పుష్ప రాజ్ లుక్ చూస్తే ఆయన్ని ఎవరూ హీరో అనుకోరు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ కన్ఫర్మ్ చెయ్యకపోయినా వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అయినా - కొరటాల అయినా లేదు అంటే కోలీవుడ్ డైరెక్టర్ తో అయినా అల్లు అర్జున్ కమిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో హీరో కాదు.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడంటూ ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కథ ప్రకారం పుష్ప లో గంధపు చెట్ల స్మగ్లింగ్ గ్యాంగ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ గ్యాంగ్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. గ్యాంగ్ లో పుష్ప రాజ్ పాత్ర చాలా నెగిటివ్ గా ఉంటుందని టాక్ వస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో దాదాపుగా అల్లు అర్జున్ నెగెటివ్ గానే కనిపిస్తాడని, అస్సలు ఎవరు హీరోలా ఫీలవ్వరని అంటున్నారు. మరి ఈ మేటర్ లో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఇప్పుడు పుష్ప సీక్రెట్ అవుట్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మాత్రం ఎక్కువైంది. రష్మిక కూడా విలన్ పక్కన ఉండే విలేజ్ అమ్మాయిలా కనిపించబోతుంది అని, అల్లు అర్జున్ పుష్ప రాజ్ గ్యాంగ్ లో జబర్దస్త్ అనసూయ కూడా ఉంటుందట. అనసూయ కేరెక్టర్ కాస్త డిఫ్రెంట్ గా డిజైన్ చేశారట సుక్కు.