Advertisement
Google Ads BL

చిరు సినిమా: బాబీ ట్విస్ట్


చిరు ప్రస్తుతం ఆచార్య ఫైనల్ షూట్ లో బిజీగా ఉన్నారు రామ్, చరణ్ రీసెంట్ గానే ఆచార్య సెట్స్ లోకి అడుగుపెట్టిన విషయాన్నీ పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఇక చిరు ఆచార్య తర్వాత అఫీషియల్ గా లూసిఫెర్ రీమేక్ లోకి జాయిన్ అవుతారు. ఇప్పటికే లూసిఫెర్ మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్  అయ్యింది. ఆ తర్వాత చిరు వేదాళం రీమేక్ చేస్తారు. మెహెర్ రమేష్ దర్శకుడిగా వేదాళం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. ఇక తర్వాత లిస్ట్ లో ఉన్న దర్శకుడు బాబీ. బాబీ చిరు తో లైన్ ఓకె చేయించుకుని ఆయన తో సినిమా కోసం వెయిట్ చెయ్యడమే కాదు.. బాబీ కూడా చిరు స్క్రిప్ట్ ని పూర్తి చేసుకుని మరీ రెడీ గా అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

Advertisement
CJ Advs

స్క్రిప్ట్ పూర్తికావడమే కాదు.. చిరంజీవి గారితో ఓకె చేయించుకోవడం కూడా అయ్యింది అని, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఈ మెగా ప్రాజెక్ట్ కి ఫైనల్ అయ్యాడని, ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, ఓ పాట‌ని రికార్డ్ చేయ‌డం, చిరు కి వినిపించ‌డం కూడా పూర్తయ్యింది అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు బాబీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అది చిరు ఆచార్య పూర్తి కాగానే లూసీఫ‌ర్ రీమేక్ మొద‌లెడ‌తారు. ఆ సినిమాతో స‌మాంత‌రంగానే నా సినిమా కూడా ఉండొచ్చు. లేదా.. లూసీఫ‌ర్ అవ్వ‌గానే.. నా సినిమా మొద‌ల‌వుతుంది అంటూ వేదాళం కన్నా తన సినిమానే మొదలు కాబోతుంది అని చెప్పి షాకిచ్చాడు. 

Chiru movie with Bobby before the remake of Vedalam:

Bobby Script Ready For Megastar Chiranjeevi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs