Advertisement
Google Ads BL

కత్తి మహేష్ మరణం.. హీరోయిన్ ట్వీట్


ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తిమహేష్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం చెన్నై అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచిన కత్తి మహేష్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ రోజు సాయంత్రం కత్తి మహేష్ పార్థివదేహాన్ని చెన్నై నుండి ఎల్లమందకు చేరుకోనుంది. 

Advertisement
CJ Advs

కత్తి మహేష్ మృతికి చింతిస్తూ పలువురు ప్రముఖులు ఆయనకి సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఉన్నారు. పూనమ్ ట్వీట్ చేస్తూ.. నా తప్పు లేకపోయినా.. నేను ప్రతీ రోజు చస్తూ బ్రతికాను. నా మనస్సులో ఇప్పుడు అనిపిస్తుంది.. ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జరిగిందని.. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక రాజకీయ పార్టీ తమ పరువు కోసం బలవంతంగా ఒక దళితుడిని.. పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. ఇక ఆ పేరును మళ్లీ ప్రస్థావించను అంటూ పూనమ్ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో పూనమ్ కౌర్ కి కత్తి మహేష్ కి మీడియా ఛానల్స్ వేదికగా పెద్ద రణరంగమే నడిచిన విషయం తెలిసిందే. తాజాగా కత్తి మహేష్ మరణంతో పూనా కౌర్ ట్వీట్ వైరల్ గా మారింది.  

Poonam Kaur Comments On Kathi Mahesh Death:

Actress Poonam Comments On actor Kathi Mahesh Death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs