మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టిన రోజు నేడు. ఒక్కప్పుడు బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా టాప్ లో ఉన్న మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్నాళ్లుగా కాస్త స్తబ్దుగా ఉన్నప్పటికీ.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మణిశర్మకి టాలీవుడ్ బడా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్ హిట్ లో మేజర్ పార్ట్ మణిశర్మ మ్యూజిక్, నేపధ్య సంగీతానికి చెందుతుంది. ఇస్మార్ట్ హిట్ తర్వాత ఫుల్ ఫామ్ లోకొచ్చేసిన మణిశర్మ చేతిలో అరడజనకు పైగానే సినిమాలున్నాయి. ఆయన మ్యూజిక్ అందించిన ఆచార్య, నారప్ప, సీటిమార్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
నేడు మణిశర్మ పుట్టిన రోజు స్పెషల్ గా ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమాల నుండి ఆయనకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటూ సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నారప్ప నుండి మణిశర్మ పుట్టిన రోజు స్పెషల్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది టీం. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఆచార్య, నారప్ప, సీటిమార్, భళా తందనాన సినిమాల నుండి బర్త్ డే విష్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాయి ఆయా మూవీ టీమ్స్. మరి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మకి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.