Advertisement
Google Ads BL

పవర్ ఫుల్ విక్రమ్


ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ పేరు మాములుగా మోగిపోలేదు. కార్తీ తో చేసిన ఖైదీ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన లోకేష్ కనకరాజ్ ఆ తర్వాత స్టార్ విజయ్ తో మాస్టర్ మూవీ చేసాడు. మాస్టర్ మూవీ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమా రిలీజ్ కాకుండానే లోకనాయకుడు కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ తో సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యి షాకిచ్చారు. కమల్ హాసన్ పొలిటికల్ గా బిజీగా ఉంటూనే సినిమా చేస్తున్నారు. అయితే లోకేష్ కనకరాజ్ - కమల్ హాసన్ కాంబో మూవీ విక్రమ్ కోసం పవర్ ఫుల్ విలన్స్ గా విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తీసుకొచ్చారు. 

Advertisement
CJ Advs

ఫహద్ ఫాజిల్ గతంలోనూ పలు తమిళ మూవీస్ లో నటించడం, విజయ్ సేతుపతి మాస్టర్ విలనిజం బాగా పండడంతో.. లోకేష్ కనకరాజ్ మరోసారి కమల్ విక్రమ్ కోసం విజయ్ సేతుతిని విలన్ తెచ్చారు. అయితే తాజాగా విక్రమ్ ఫస్ట్ లుక్ ని వదిలింది టీం. కమల్ హాసన్ కొత్తగా గెడ్డం మీసాలు, హెయిర్ తో పవర్ ఫుల్ గా కనిపిస్తుంటే.. రైట్ అండ్ లెఫ్ట్ లో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతిలు కనిపిస్తూన్నారు. విక్రమ్ ఫస్ట్ లుక్ చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంది. 

Kamal Haasan Vikram First Look revealed :

Lokesh Kanagaraj - Kamal hasan Vikram First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs