Advertisement
Google Ads BL

ఆచార్య ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్


చిరంజీవి - కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ అప్ డేట్ వచ్చేసింది. రామ్ చరణ్ కీలక పాత్రలో సిద్ద గా నటిస్తున్న ఆచార్య పోస్ట్ కరోనా షూట్ మొదలయ్యింది. రామ్ చరణ్ సిద్ద ఫుల్ లుక్ తో ఆచార్య అప్ డేట్ ఇచ్చేసింది టీం. ధర్మస్థలి డోర్స్ రీ ఓపెన్ అంటూ రామ్ చరణ్ లుక్ తో పాటుగా అప్ డేట్ ఇచ్చారు. ఆచార్య ఫైనల్ షెడ్యూల్ ఆచార్య కోసం వేసిన టెంపుల్ సెట్ లో మొదలు పెట్టేసారు. ఇక సిద్ద గా మేడలో తుండు, రుద్రాక్ష మాల వేసుకుని.. నుదిటిన బొట్టు తో లాల్చీ తో రామ్ చరణ్ కొత్తగా కనిపిస్తున్నాడు ఆచార్య పోస్టర్ లో

Advertisement
CJ Advs

చిరు - ఆచార్య కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరు కి పెయిర్ గాను, రామ్ చరణ్ కి జోడిగా నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే నటిస్తుంది. అయితే ఆచార్య ఫైనల్ షెడ్యూల్ రామ్ చరణ్ - చిరు పై కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతుంది.. ఓ 15 రోజులపాటు షూటింగ్ చేస్తే.. ఆచార్య షూటింగ్ కంప్లీట్ గా పూర్తవుతుంది అని తెలుస్తుంది. ఇక షూటింగ్ చకచకా ముగించి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని టీం ఆలోచన. అయితే ఇంత అప్ డేట్ ఇచ్చినా సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టింది ఆచార్య టీం. 

Acharya Final Schedule Update :

The Doors to Dharmasthali have reopened, Acharya is in it's final schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs