అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో థాంక్యూ మూవీ తో పాటుగా, లవ్ స్టోరీ సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరోపక్క బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. నిన్న శుక్రవారమే అఫీషియల్ గా లాక్ సింగ్ చద్దా షూటింగ్ లో జాయిన్ అయిన విషయాన్నీ ఓ సెల్ఫీ రూపంలో షేర్ చేసాడు. చైతు - అమీర్ ఖాన్, ఆయన మాజీ వైఫ్ కిరణ్ రావు, బాల తో ఉన్న ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. నిన్ననే లఢక్ లో లాల్ సీఒంగ్ చద్దా షూట్ లో జాయిన్ అయినట్లుగా ప్రకటించింది టీం.
అయితే ఆ సెల్ఫీ కి చైతు వైఫ్ ఏయ్ ఏయ్ అంటూ స్పందించగా.. తాజాగా రానా దగ్గుబాటి.. ma bawa bolly!! So cool man!! @chay_akkineni all the best .. మా బావ బాలీ.. సో కూల్ మ్యాన్, చైతు ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పుడు వైరల్ గా మారింది. నాగ చైతన్య కన్నా ముందే రానా పాన్ ఇండియా మూవీస్ తో నార్త్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నాగ చైతన్య - రానా అన్నా- చెల్లెళ్ళ బిడ్డలు. అందుకే రానా అంత ప్రేమగా చైతు బాలీవుడ్ మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాడు.