Advertisement
Google Ads BL

హీరోయిన్ నమిత సన్సేషనల్ కామెంట్స్


హీరోయిన్ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న నమిత దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. శ్రీవారి దర్శనానంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత శ్రీ వారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది అని, అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ భయం భయంగా టెంక్షన్ గా కనిపిస్తున్నారని, అది కాస్త ఇబ్బందిగా అనిపించింది అని, గతంలో శ్రీనివాస మూర్తి గారు ఉన్నప్పుడు ఇక్కడ పాలన బావుండేది అని, ప్రస్తుతం తిరుపతిలో పాలన బాలేదంటూ నమిత సెన్సేషనల్ గా మట్లాడారు. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా తాను నటించిన బౌబౌ సినిమా విడుదలకు సిద్దంగా వుందన్నారు. అయితే ప్రస్తుతం పాండమిక్ సిట్యువేషన్ లో సినిమాని థీయేటర్లలో రిలీజ్ చేయాలా లేదా ఓటిటిలో‌ చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వుందని తెలిపారు. త్వరలోనే ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తామని నమిత మీడియా తో చెప్పారు. ఇప్పటికే నమితా థియేటర్‌ పేరుతో ఓటిటి, నమిత ఫిలిం ఫ్యాక్టరీ పేరుతొ ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నామని నమిత చెప్పారు. 

Namitha Shocking Comments After Darshan to Lord Tirumala Tirupati Venkateswara Swamy:

Namitha and Husband Darshan to Lord Tirumala Tirupati Venkateswara Swamy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs