Advertisement
Google Ads BL

అనుపమ బ్రేకప్ స్టోరీ


అనుపమ పరమేశ్వరన్ అనగానే కర్లీ హెయిర్, లవ్లీ అందాలు, చిన్న స్మైల్, క్యూట్ ఎక్సప్రెషన్స్, హోమ్లీ హీరోయిన్ అంటూ అభివర్ణిస్తారు. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమకు స్టార్ హీరోల ఛాన్సెస్ తగిలింది లేదు. రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న అనుపమ కి లవ్ బ్రేకప్ అయ్యిందట. ఆ విషయాన్ని అనుపమే చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో 18 పేజీలు, కార్తికేయ -2, రౌడీ బాయ్స్‌ చిత్రాలతో బిజీగా వున్న అనుపమ పరమేశ్వరన్ తమిళ్ లో కూడా ఓ మూవీ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా అనుపమ తాను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించా అంటూ షాకిచ్చింది. గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్‌ అయిపోయింది అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. మొన్నా మధ్యన క్రికెటర్ బుమ్రా ని అనుపమ వివాహం చేసుకుంది అంటూ ప్రచారం జరగడం అనుపమ తల్లి ఖండించడం జరీగింది. మళ్ళీ ఇప్పుడు ఓ వ్యక్తి తో ప్రేమ, బ్రేకప్ ముచ్చట్లు చెబుతుంది అనుపమ. ఇక టాలీవుడ్ లో తనకి మంచి ఫ్రెండ్ ఎవరంటే.. రామ్ పోతినేని పేరు చెప్పింది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

Anupama Parameswaran Breakup Story Revealed:

Anupama Parameswaran Shares about her Relationship Break-up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs