గత కొన్నాళ్లుగా మెగా హీరో అల్లు శిరీష్ సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నాడు అనే అనుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం బాలీవుడ్ డెబ్యూ సాంగ్ లో ఇరగదియ్యడమే కాదు.. ఆయన తదుపరి మూవీ కోసం జిమ్ లో వర్కౌట్స్ తో అదరగోట్టేస్తున్నాడు. ఈమధ్యన అల్లు శిరీష్ జిమ్ వీడియోస్ తరుచు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అంత క్రేజ్ లేకపోయినా శిరీష్ తనవంతుగా కేరీర్లో ఎదగడానికి కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అను ఇమ్మాన్యువల్ తో ప్రేమ కాదంట సినిమా చేస్తున్నాడు. అను ఇమ్మాన్యువల్ - అల్లు శిరీష్ ప్రేమ కాదంట రొమాంటిక్ పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
అయితే తాజాగా అల్లు శిరీష్ మెడకి బెల్ట్ వేసుకుని, గాయమైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది స్వయంగా అల్లు శిరీషే ఇన్స్టా లో పోస్ట్ చేసాడు, ఆ పిక్ తో పాటుగా.. ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకోలేదని, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మెడకు గాయం అయ్యిందని అందుకే ఇది అంటూ పోస్ట్ చేసాడు. ఆ ఫోటో చూసిన అల్లు ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. అల్లు శిరీష్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేసున్నారు.