Advertisement
Google Ads BL

నితిన్ మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్


వ‌చ్చే వారం నుండి ప్రారంభంకానున్న నితిన్ మేర్ల‌పాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్..

Advertisement
CJ Advs

వెర్స‌టైల్ హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీల ఫస్ట్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం మ్యాస్ట్రో. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్త‌య్యింది. నెక్ట్స్ వీక్ నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుంద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ బీచ్‌లో పియానో వాయిస్తూ క‌నిపిస్తున్నారు.

నితిన్‌ హిట్‌ మూవీ భీష్మ కు సంగీతం అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను ఆశించొచ్చు.

ఇప్ప‌టికే నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

Nithiin Maestro Music Fest Begins Next Week:

Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Music Fest Begins Next Week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs